- పార్లమెంటు మకర్ ద్వార్ వద్ద బీజేపీ ఎంపీల నిరసన
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర విద్యార్థులు చేస్తున్న ఆందోళనల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనంగా ఉండటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఆవరణలోని ‘మకర్ ద్వార్’ వద్ద బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సహా ఇతర ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు.

ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల సమస్యలపై గొంతెత్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా అధికారంలో ఉన్న ఝార్ఖండ్‌లో జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని ఎంపీలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని వారు విమర్శించారు. జేపీఎస్సీ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
