Homeరంగారెడ్డిSupport | నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయం

Support | నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయం

  • జవహర్‌నగర్‌లో సమ్మయ్య దశదిన కార్యక్రమానికి వంట సామగ్రి అందజేత

జవహర్‌నగర్ 10వ డివిజన్‌కు చెందిన పేద వికలాంగుడు సమ్మయ్య కుటుంబానికి పలువురు నాయకులు, వికలాంగుల సంఘాల ప్రతినిధులు అండగా నిలిచారు. స్పైనల్ కార్డ్ ఇంజురీ, బ్రెయిన్ ట్యూమర్‌తో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య గతవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న దశదిన కార్యక్రమానికి అవసరమైన వంట సామగ్రిని శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు.

సమ్మయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ పలువురు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పిలుపుతో పలువురు నాయకులు, వికలాంగుల సంఘాల ప్రతినిధులు తమ వంతు సహాయంగా ముందుకు వచ్చి కుటుంబానికి అవసరమైన సామగ్రిని అందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు భాష వోని.కొండల్ ముదిరాజ్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్. కూతాడి సాయి, వికారాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాయ బ్రహ్మ నరసింహ, జింక. నాగులు ముదిరాజ్, సీనియర్ వికలాంగుల నాయకుడు టైగర్ నరసింహ, ఎంపీఆర్‌డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి, ఎంపీఆర్‌డి సీనియర్ వికలాంగుల నాయకులు ధనరాజ్, రాజేందర్, నర్సింగరావు, అప్పారావు, రమేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రంగుల సతీష్, సీనియర్ జర్నలిస్ట్ గంగాధర్ చారి, బలగం టీవీ సీఈవో చింతల విజయ్ కుమార్, జినుక రఘు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ సమ్మయ్య కుటుంబానికి అండగా నిలిచి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కుటుంబ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. సమ్మయ్య కుమార్తెల చదువుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కూడా హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెరుగు శివకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి వికలాంగులు పత్రిక ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు.తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News