Homeరంగారెడ్డిHanuman Das | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సహాయం అందిస్తాం

Hanuman Das | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సహాయం అందిస్తాం

  • హనుమాన్ దాస్
  • యాడారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ..

విద్యార్థులే దేశ భవిష్యత్తు అని వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు హాజరై చదువులో రాణించేందుకు అవసరమైన సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యడారం కౌన్సిలర్ లింగోళ్ళ హనుమాన్ దాస్ తెలిపారు. గురువారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు యాడారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కౌన్సిలర్ లింగోళ్ళ హనుమాన్ దాస్ విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లింగోళ్ళ హనుమాన్ దాస్ మాట్లాడుతూ…

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు అవసరమైన మౌలిక సౌకర్యాలు కూడా ఎంతో కీలకం అని చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు హాజరై చదువులో రాణించాలనే ఉద్దేశంతో షూస్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల పట్ల చూపుతున్న సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News