- చర్చకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ డిమాండ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని విపక్ష పార్టీల ఎంపీలను బీజేపీ అడ్డదారిలో లాక్కుంటోందని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎంపీలను సీబీఐ, ఈడీల భయంతో లొంగదీసుకుని కొనుగోలు చేస్తున్న వ్యవహారంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఆయన స్పీకర్‌కు వాయిదా తీర్మానం అందజేశారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ అనైతిక ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడిన ఆయన.. ఈ వ్యవహారంపై సభలో వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
- Advertisement -
