- శాంతియుత వాతావరణంలో ఫలహారం బండ్లను తరలించాలి – కారింగుల రాజు గౌడ్
- పోలీస్ అధికారుల ఆదేశాలను అతిక్రమించవద్దు – రాజు గౌడ్
- ఆగస్టు 23, 24, తేదీల్లో జవహర్ నగర్ బోనాల జాతర – కారింగుల రాజు గౌడ్
ప్రశాంత వాతావరణం లో బోనాల పండుగ ఉత్సవాలను జరుపుకోవాలని జవహర్ నగర్ మహంకాళి ప్రధాన దేవాలయ కమిటీ చైర్మన్ కారింగుల రాజు గౌడ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ అమ్మవార్లకు అత్యంత ప్రీతికరమైన ఆషాడం శ్రావణమాసంలో తరతరాల ఆనవాయితీ ప్రకారం అమ్మవార్ల బోనాల జాతర ఉత్సవాలను జరుపుకుంటున్న మాదిరిగానే ఈ సంవత్సరం ఆగస్టు 23, 24, తారీకు ఆదివారం సోమవారం రోజుల్లో బోనాల జాతర కార్యక్రమాన్ని జవహర్ నగర్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో బోనాల జాతర తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు.
భక్తులందరూ బంధుమిత్రుల సపరివారంతో మహంకాళి అమ్మవారికి గోన నైవేద్యాలు సమర్పించడంతోపాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు సోమవారం అమ్మవారి నైవేద్య సమర్పణ కోసం బయలుదేరే పలహారం బండ్ల నిర్వాహకులు ఏలాంటి ఘర్షణలు అఘాయిత్యాలు తావివ్వకుండా భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీస్ అధికారులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఫలహారం బండ్లు తరలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారింగుల శంకర్ గౌడ్ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగోని కోటేష్ గౌడ్, శ్రీకాంత్, గొడుగు వేణు బండకింది ప్రసాద్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ గణేష్ నరేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు
