Saturday, July 4, 2026
Homeకెరీర్ న్యూస్Jobs | తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త…

Jobs | తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త…

  • పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 5,000 పోస్టులు భర్తీకి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సబ్-ఇన్స్పెక్టర్ (సివిల్) 148 పోస్టులు , సబ్ -ఇన్స్పెక్టర్ (ఏఆర్) 14 పోస్టులు ,రిజర్వు సబ్ -ఇన్స్పెక్టర్(TGSP)12 పోస్టులు ,సబ్ -ఇన్స్పెక్టర్ (SARCPL) 3 పోస్టులు , అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (FPB) 23 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697 పోస్టులు ,పోలీస్ కానిస్టేబుల్ (ఏ ఆర్) 1,052 పోస్టులు , పోలీస్ కానిస్టేబుల్ ( SARCPL) 243 పోస్టులు , పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) 209 పోస్టులు , పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) 7 పోస్టులు భర్తజి చేయనున్నారు.మొత్తం కలిపి 5,000 పోస్టులుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ పోస్టుల్లో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697 ఉండటం విశేషం.దీంతో పోలీస్ ఉద్యోగాలను లక్షయంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది ఒక పెద్ద అవకాశంగా మారనుంది.అలాగే ఎస్ఐ,ఏఆర్,టీజీస్పీ,డ్రైవర్, మెకానిక్ విభాగాల్లో కూడా నియామకాలు జరగనున్నాయి.ఈ ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ కావడంతో శాంతిభద్రతల నిర్వహణ మరింత బలోపేతం కానుంది అని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ప్రభుత్వం పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతులు మాత్రమే ఇచ్చింది. త్వరలో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు లేదా సంబంధిత నియామక సంస్థ పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, ఎంపిక విధానం, శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పరుగులు, లాంగ్ జంప్, హైజంప్ వంటి ఫిజికల్ ఈవెంట్స్‌తో పాటు జనరల్ స్టడీస్, రీజనింగ్, అంకగణితం, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై దృష్టి పెడితే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో, పోలీస్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News