- మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్.
- నూతన మండల ఉప సర్పంచుల సంఘం సభ్యులకు ఘన సన్మానం.
ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని,ప్రజా సమస్యలను తీరుస్తూ పారదర్శకమైన పాలనను అందించాలని నందిగామ,కొత్తూరు మండలాల మాజీ ఎంపీపీ మంచనపల్లి శివశంకర్ గౌడ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని చేగూర్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉప సర్పంచుల సంఘం సన్మానసభలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నూతన ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు అవులమంద శివశంకర్ తో పాటు కమిటీ సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించిన అవకాశాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుని ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు అవులమంద శివశంకర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు, అవకాశాన్ని కల్పించిన నా తోటి మిత్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.ఈ సన్మానసభలో ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
