Monday, June 1, 2026
Homeఆరోగ్యంVitamin D | ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ..

Vitamin D | ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ..

  • ఎన్నో కీలకమైన విధుల్లో ముఖ్య పాత్ర..
  • విటమిన్ డీ లోపం దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది..

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ ‘డి’ ఒకటి. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. మన ఎముకల ఆరోగ్యం నుంచి రోగనిరోధక శక్తి వరకు ఎన్నో కీలకమైన విధుల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, గంటల తరబడి ఏసీ గదుల్లోనే గడపడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల నేటి తరం వారిలో, ముఖ్యంగా యువత, ఉద్యోగుల్లో ఈ విటమిన్ లోపం తీవ్రంగా కనిపిస్తోంది. ఇది చిన్న సమస్యగా అనిపించినా, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్‌లను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వృద్ధులలో ఎముకల బలహీనత (ఆస్టియోపోరోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. కండరాల పనితీరును మెరుగుపరిచి, వాటిని బలంగా మార్చడంలో కూడా విటమిన్ డి పాత్ర ఉంది.

- Advertisement -

విటమిన్ డి లోపాన్ని శరీరం కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. వీటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం, కండరాల బలహీనత, ఎముకలు, కీళ్లలో తరచూ నొప్పి రావడం, తరచుగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News