- పసివాడి పాలిట శాపం..
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది విధి నిర్వహణలో చేసిన నిర్లక్ష్యం ఓ పసివాడి జీవితం పాలిట శాపమైంది. నెలలు నిండక ముందే ఈ లోకంలోకి వచ్చిన ఓ పసికందు అంగవైకల్యానికి కారణమైంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు చేతికి ఇన్ఫెక్షన్ జరిగి చివరికి ఆ చెయ్యిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి రేణుక, సత్యకాంత్ దంపతులు. ఏడు నెలల గర్భిణి అయిన రేణుక నెలలు నిండక మునుపే గత మార్చి3న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పిల్లాడు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉండగా, మరో బాబు కిలో 200 గ్రాముల బరువుతో పుట్టాడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. తక్కువ బరువుతో పుట్టిన శిశువు మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో చేర్చారు.
