Thursday, May 28, 2026
Homeస్పోర్ట్స్Record | సూర్యవంశీపై ప్రశంశలు..

Record | సూర్యవంశీపై ప్రశంశలు..

  • యూనివర్సల్ బాస్ వర్సెస్ యానివర్సల్ బేబీ బాస్..
  • గేల్ రికార్డుని బద్దలు కొట్టిన వైభవ్ సూర్య వంశీ..

యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్‌ యూనివ‌ర్స‌ల్ బేబీ బాస్ వైభ‌వ్ సూర్య‌వంశీపై ప్ర‌శంస‌లు కురిపించారు. తాజా ఐపీఎల్‌లో గేల్ రికార్డును వైభ‌వ్ బ్రేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉన్న‌ది. అయితే బుధ‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ బ్యాట‌ర్ వైభ‌వ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 2012 సీజ‌న్‌లో గేల్ 59 సిక్స‌ర్లు బాదాడు. ఇక ఇప్పుడు సూర్య‌వంశీ ఇప్ప‌టికే 65 సిక్స‌ర్లు కొట్టేశాడు.

ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌పై అత‌ను ఏకంగా 12 సిక్స‌ర్లు బాదాడు. 29 బంతుల్లో 97 ర‌న్స్ చేసిన వైభ‌వ్‌పై యూనివ‌ర్స‌ల్ బాస్ గేల్ ప్ర‌శంస‌లు కురిపించారు. వైభ‌వ్ సూర్య‌వంశీ అసాధార‌ణ బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని, అత‌నో కొత్త సిక్స్ మెషీన్ అని గేల్ అన్నారు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గేల్ స్పందిస్తూ వైభ‌వ్ ను సిక్స్ మెషీన్‌తో పోల్చారు. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో మ‌రో రికార్డును నెల‌కొల్పే అవ‌కాశాన్ని సూర్య‌వంశీ మిస్స‌య్యాడు. ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసే అవ‌కాశాన్ని వైభ‌వ్ చేజార్చుకున్నాడు.

- Advertisement -

ఆ రికార్డును మిస్ కావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఎలాగైనా ఆ రికార్డును అత‌ను అధిగ‌మిస్తాడ‌ని వైభ‌వ్‌పై గేల్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య‌వంశీ 15 ఇన్నింగ్స్‌లో 680 ర‌న్స్ చేశాడు. యావ‌రేజ్ 45.33గా ఉంది. ఇక స్ట్ర‌యిక్ రేట్ 242.85గా ఉంది. ఓ సెంచ‌రీతో పాటు నాలుగు ఫిఫ్టీలు అత‌ని ఖాతాలో ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో వైభ‌వ్ బెస్ట్ స్కోరు 103. 280 బంతులు ఎదుర్కొన్న అత‌ను మొత్తం 55 ఫోర్లు 65 సిక్స‌ర్లు బాదాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News