Thursday, May 28, 2026
Homeకెరీర్ న్యూస్TG PGECET | నేటి నుంచే పీజీ ఈసెట్ పరీక్షలు..

TG PGECET | నేటి నుంచే పీజీ ఈసెట్ పరీక్షలు..

  • జూన్ 1వ తారీఖుతో ముగియనున్న ఎగ్జామ్స్..
  • ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు వెల్లడి..
  • 7 సెంటర్లు ఏర్పాటు చేసాం : పీజీ ఈసెట్ కన్వీనర్..

ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెలంగాణ పీజీఈసెట్‌ పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమైన పరీక్షలు జూన్‌ 1వ తేదీతో ముగుస్తాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనుండగా, 26,085 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో 24, వరంగల్‌లో 7 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News