- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 101 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఇందులో భూభారతి సంబంధిత 52, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 8, పెన్షన్లకు సంబంధించిన 9, ఇతర సమస్యలకు సంబంధించిన 32 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
