Saturday, July 4, 2026
Homeభక్తిKalashtami | ఈనెల 7నాడు కాళాష్టమి..

Kalashtami | ఈనెల 7నాడు కాళాష్టమి..

  • జూలై 8 మధ్యాహ్నం వరకు పూజలు చెయ్యొచ్చు..
  • వివరించిన ఆధ్యాత్మిక వేత్తలు..

ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథినాడు వచ్చే మాసిక కాలాష్టమికి హిందూ ధర్మంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు పరమశివుని ఉగ్ర, పరాక్రమ స్వరూపమైన శ్రీ కాలభైరవ స్వామి’కి అంకితం చేయబడింది. కాలాష్టమి రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి, కాలభైరవుడిని ఆరాధిస్తే భయాలు తొలగిపోవడంతో పాటు జీవితంలోని అడ్డంకులు, ప్రతికూల శక్తులు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే, 2026 జూలై నెలలో కాలాష్టమి జూలై 6న వస్తుందా? లేక జూలై 7న పాటించాలా? అనే సందేహం చాలామందిలో ఉంది.

పంచాంగం ప్రకారం, ఆషాఢ మాస కృష్ణ పక్ష అష్టమి తిథి 2026 జూలై 7వ తేదీ మధ్యాహ్నం 1:24 గంటలకు ప్రారంభమై, జూలై 8వ తేదీ మధ్యాహ్నం 12:21 గంటలకు ముగుస్తుంది. ఉపవాసాలు, వ్రతాలు సాధారణంగా ఉదయ తిథి ఆధారంగా పాటించే సంప్రదాయం ప్రకారం, మాసిక కాలాష్టమిని 2026 జూలై 7వ తేదీ నాడు ఆచరిస్తారు. ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అనంతరం శివుడు, కాలభైరవ స్వామిని ధ్యానిస్తూ పూజను ప్రారంభించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News