Homeమెదక్‌BG Venkatapur | మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం

BG Venkatapur | మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం

  • మనమంతా ఒక్కటై గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చలేమా..?
  • గ్రామాన్ని మరో గంగదేవిపల్లి గ్రామం కావాలి
  • ప్రతి ఒక్కరూ గ్రామసభకు హాజరు కావాలి
  • చెప్పేవారు చాలా చెబుతారు మనమేంటో చేసి చూపెడదాం.
  • గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్

మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని .మనమంతా ఒక్కటై గ్రామాన్ని ఆదర్శం గ్రామంగా తీర్చుకోలేమా అని . గతంలో కాకుండా మన గ్రామానికి ఎవరైనా కొత్తవారు వచ్చి చూస్తే గ్రామానికి దత్తత తీసుకుంటామనే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని దీనికి గ్రామస్తులంతా సహకరించాలని గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం రోజున జగదేవపూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో బాలావికాస సంస్థ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు గ్రామ సభకు హాజరు కావాలని ఈ సంస్థ కేవలం నిజమైన పేద గ్రామాలకే వారి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ సంస్థ నుండి గ్రామానికి 80/వరకు సహకారం అందిస్తుందని మిగిలిన 20/ గ్రామస్తులు నుండి పెట్టుబడులు పెట్టిస్తుందని తెలిపారు. మనమంతా సమష్టిగా కృషి చేసి గ్రామాన్ని మరో గంగాదేవిపల్లి గ్రామంగా తీర్చి దిద్దెలాల కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
Model Village Development Initiative1

గతంలో గంగదేవిపల్లి పంచాయతీలకు నిలయంగా ఉండేది కానీ ప్రస్తుతం పరిష్కారాలకు నిలయంగా మారిందనీ ఆ గ్రామాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు అన్నట్టుగా ఉన్నదని ఆయన గ్రామస్తులకు వివరించారు. మన గ్రామాన్ని కూడా మరో గంగదేవి పల్లి గ్రామంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేద్దామని గ్రామస్తులకు పిలుపునిచ్చారు .దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

దీనికి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి పంచాయతీ ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస మేనేజర్ మంజుల, ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమేష్, డెవలప్మెంట్ ఏజెంట్స్ దుబ్బాసి రమేష్, మల్లం వెంకటేష్, తొగరి రమేష్, గ్రామ ఉప సర్పంచ్ పోకల బాబు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News