Wednesday, May 13, 2026
Homeకెరీర్ న్యూస్US | అమెరికాలో భారతీయ విద్యార్థుల ఇక్కట్లు..

US | అమెరికాలో భారతీయ విద్యార్థుల ఇక్కట్లు..

  • అషనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం..
  • మోసాలకు కేంద్రంగా మారిందని విమర్శలు..

అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అనుభవం కల్పించే యూ ఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలోని దర్యాప్తు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తున్న అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తూ దాదాపు 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు ఐ సి ఈ ప్రకటించింది. వీరిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారని అమెరికా అధికారులు తెలిపారు.

ఓపీటీ అనేది అమెరికాలో ఎఫ్ – 1 స్టూడెంట్ వీసాపై చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు తమ విద్యా రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో తాత్కాలికంగా పనిచేసే అవకాశం ఇచ్చే ప్రోగ్రామ్. సాధారణంగా ఇది 12 నెలలపాటు ఉంటుంది. స్టెమ్ కోర్సులు చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది విద్యార్థులు తరువాత హెచ్ 1బీ ఉద్యోగ వీసాలకు మారే అవకాశం పొందుతున్నారు. అమెరికా ఐసీఈ యాక్టింగ్ డైరెక్టర్ టాడ్ లైన్స్ ప్రకారం ఓపీటీ వ్యవస్థ “మోసాలకు కేంద్రంగా మారింది”. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News