Wednesday, May 13, 2026
Homeబిజినెస్Gold | మోడీ మాటతో బంగారం కొనుగోళ్లు ఢమాల్..

Gold | మోడీ మాటతో బంగారం కొనుగోళ్లు ఢమాల్..

  • పడిపోయిన జ్యులరీ కంపెనీల షేర్లు..

ప్రభుత్వ నిర్ణయాలతో బంగారం రంగం అతలాకుతలమవుతోంది. ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరడం, దిగుమతి సుంకం 15 శాతానికి పెరగడంతో జ్యువెలరీ కంపెనీల షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి. దీనివల్ల మూడు రోజుల్లోనే రూ. 60 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. రూపాయి విలువను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం కొనే ముందు ఒక్క నిమిషం ఆలోచించమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న విన్నపం.. స్టాక్ మార్కెట్‌లో ఒక పెను తుపానును సృష్టించింది.

కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, సెన్కో గోల్డ్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు కుప్పకూలిపోయాయి. కేవలం మాటలతోనే ఆగిపోకుండా, ప్రభుత్వం వెంటనే బంగారం దిగుమతి సుంకాలను 6శాతం నుండి ఏకంగా 15 శాతంకి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుంటే, ఆ ప్రభావం నేరుగా జ్యువెలరీ రంగంపై పడింది.

- Advertisement -

మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ షేరు దాదాపు 20 శాతం పతనమవ్వగా, తంగమయిల్, స్కై గోల్డ్ వంటివి 18శాతం వరకు నష్టపోయాయి. సెన్కో గోల్డ్ 14 శాతం టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ 11 శాతం మేర పడిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ. 60,000 కోట్లు గాలిలో కలిసిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ ముందు ఇలాంటి నిర్ణయాలు రావడం వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News