Wednesday, May 13, 2026
Homeస్పోర్ట్స్SRH | ఘోరపరాజయం పాలైన సన్ రైజర్స్..

SRH | ఘోరపరాజయం పాలైన సన్ రైజర్స్..

  • కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ కు భారీ జరిమానా..
  • స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్..

ఐపీఎల్‌లో మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు 82 ర‌న్స్ తేడాతో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.అయితే ఆ మ్యాచ్‌లో హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్‌ క‌మ్మిన్స్‌ కు జ‌రిమానా ప‌డింది. స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా అత‌నికి ఫైన్ విధించారు. ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అత‌నికి 12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. వాస్త‌వానికి ఈ మ్యాచ్ కేవ‌లం 34.5 ఓవ‌ర్ల‌లోనే ముగిసింది.

అయినా కానీ క‌మ్మిన్స్‌కు జ‌రిమాన విధించాల్సి వ‌చ్చింది. ఫ‌స్ట్ బౌలింగ్ చేసిన హైద‌రాబాద్‌.. చాలా నెమ్మ‌దిగా బౌలింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు ఇదే తొలి ఉల్లంఘ‌న‌గా ఐపీఎల్ పేర్కొన్న‌ది. ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలోని ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం క‌మ్మిన్స్ ఫైన్ వేస్తున్న‌ట్లు ఐపీఎల్ త‌న రిలీజ్‌లో చెప్పింది. 169 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ జ‌ట్టు కేవ‌లం 86 ప‌రుగుల‌కే ఆలౌటైంది. జీటీ పేస్ బౌల‌ర్లు ఈ మ్యాచ్‌లో చెల‌రేగిపోయారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News