Homeఆదిలాబాద్News Verification | నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి

News Verification | నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి

  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా
  • మీడియా ప్రతినిధులు వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ హాల్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫేక్ న్యూస్, (news verification) తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకుంటూ, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వార్తల్లో వేగం కంటే వాస్తవికత, (News Verification) విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలును వెలుగులోకి తీసుకురావడంలో స్థానిక విలేకరుల పాత్ర కీలకమన్నారు. జర్నలిస్టులకు శిక్షణ అందించడంతో పాటు, వారి సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షాలను శాలువాలతో సత్కరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, డీపీఆర్వో విష్ణు వర్ధన్, రచన కళాశాల ప్రిన్సిపాల్ ఉమ మహేశ్వర్ రావు, మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్వర్, దేవేందర్, బేత రమేష్, వినోద్, సురేష్, షాహిద్, వెంకట్, కిరణ్ తదితరులతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News