హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని చేర్యాల మండలం, అకునూరులో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన ఇమాంబి కాషా, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద యంత్రం సహాయంతో వరి ధాన్యాన్ని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆమె జుట్టు ఆ యంత్రం యొక్క తిరిగే చక్రంలో చిక్కుకుపోయింది. ఆ యంత్రం అత్యంత వేగంతో పనిచేస్తుండటం వల్ల, ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృ*తి చెందింది.

- Advertisement -
