Friday, June 26, 2026
Homeస్పోర్ట్స్Mexico | చరిత్ర సృష్టించిన మెక్షికో..

Mexico | చరిత్ర సృష్టించిన మెక్షికో..

  • మూడుకు కూడు మ్యాచుల్లో విజయం..
  • శత్రు జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వని జట్టు..

ఆద్యంతం వేడుకలా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ 2026లో మెక్సికోచరిత్ర సృష్టించింది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచుల్లో విజయాలతో నాకౌట్‌కు వెళ్లిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని ఒక్కగోల్ కూడా కొట్టనివ్వలే. తద్వారా.. లీగ్ దశలో శత్రు జట్టుకు ఒక్క గోల్ సమర్పించుకోని జట్టుగా రికార్డు పుస్తకాల్లో నిలిచింది. మొత్తంగా సాకర్ వరల్డ్‌కప్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆరో జట్టుగా మెక్సికో గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి.

లీగ్ దశ 33వ మ్యాచ్‌లోనే వంద గోల్స్ నమోదవ్వడం ఓ రికార్డైతే.. ఆతిథ్య మెక్సికో ప్రత్యర్థికి ఒక్క గోల్ ఇవ్వకుండానే నాకౌట్‌ చేరింది. బుధవారం చెక్ రిపబ్లిక్‌ను 3-0తో చిత్తు చేసి.. హ్యాట్రిక్ విజయాలతో ఔరా అనిపించిన మెక్సికో వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. ఇదివరకూ నెదర్లాండ్స్‌(1974), బ్రెజిల్(1986), ఇటలీ(1990), అర్జెంటీనా(1998), ఉరుగ్వే(2018).. ఈ ఐదు జట్లు మాత్రమే లీగ్ దశలో ప్రత్యర్థిని ఒక్క గోల్ కొట్టనివ్వలేదు. గ్రూప్ ఏలోని మెక్సికో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 0-2తో ఓడించింది.

- Advertisement -

రెండో గేమ్‌లో దక్షిణ కొరియాను వణికిస్తూ 1-0 విజయం సాధించింది. బుధవారం చెక్ రిపబ్లిక్‌ను 3-0తో ఓడించిన మెక్సికో నాకౌట్‌ బెర్తు పట్టేసింది. మూడు విజయాలు.. ఆరు పాయిట్లతో అగ్రస్థానం దక్కించుకుంది మెక్సికో. 32వ రౌండ్‌ తొలి మ్యాచ్‌లో మంగళవారం ఎస్తాడియో అజ్కెకాను ఎడ్సన్ అవ్వరెజ్ సారథ్యంలోని మెక్సికో ఢీకొట్టనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News