అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం నూతన గోదాముకు బుధవారం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ను కోహెడలో ఏర్పాటు చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి చెందిన 20 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.


అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, పాలకవర్గ సభ్యులు, ఎంపిడిఓ శ్రీవాణి, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బాటసింగారం బ్యాంకు చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, డైరెక్టర్లు, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
