తెలంగాణలో మరో మార్కెట్ మొయినాబాద్ లో 39.07 ఏకరాలతో ఏర్పడుతుంది, అదనంగా మరో 20 ఏకరాలతో మార్కెట్ నిర్మించనున్నారు. మార్కెట్ లో వ్యాపారులకి, రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నిరకాల ఆధునిక వసతులతో నిర్మిస్తున్నాం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొయినాబాద్ మండలం ప్రధాన కేంద్రంగా, అజీజ్ నగర్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో మొత్తం దాదాపు 60 ఎకరాలలో నిర్మిస్తున్నారు.
ఈ మార్కెట్ ప్రారంభమైతే ఎంతో మంది రైతులకి నేరుగా మార్కెట్ నుండి విక్రయించగలరు, వ్యాపారస్థులకి కూడా రవాణా సౌకర్యాలు వంటి వసతులతో పాటు, వినియోగదారులకు తాజా మరియు ఆరోగ్యకరమైన పంటలు లభిస్తాయి. మార్కెట్లో పెద్ద హోల్‌సేల్ ట్రేడింగ్ యార్డులు, కోల్డ్ స్టోరేజ్, ట్రక్ పార్కింగ్, లోడింగ్ మరియు అన్‌లోడింగ్ జోన్స్,అంతర్గత రోడ్లు, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మార్కెట్ రైతులకి ఎంతగానో సహాయపడుతుంది, రైతులు నేరుగా పంటని విక్రయించవచ్చు మధ్యవర్తుల అవసరం లేకుండా రైతులకి మంచి ధరకి పంట గిట్టుబాటు అవుతుంది.ORR సమీపంలో ఉండడం వలన పంట నగరానికి త్వరగా చేరుతుంది, రవాణా ఖర్చులు తగ్గుతాయి. కోల్డ్ స్టోరేజ్ ఉండడం వలన పంటను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. మార్కెట్ విస్తృతంగా నిర్మిస్తున్నందున వికారాబాద్, చేవెళ్ళ ,సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు సులభతరంగ మార్కెట్ యార్డుకు చేరుకుంటారు.
రాష్ట్రంలో అతిపెద్ధ మార్కెట్ అయిన గుడిమల్కాపూర్ (మెహదీపట్నం) లో రద్దీ తగ్గించడానికి ఈ కొత్త మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నాంది పలికింది . గతంలో భూములు అక్రమ ఆక్రమణలో ఉండగా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సి. నారాయారెడ్డి పర్యవేక్షణలో భూములు స్వాధీనం చేసుకున్నారు.
CM రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి వహించారు, చేవెళ్ళ MLA యాదయ్య అభ్యర్ధనతో ప్రాజెక్టు పనులు వేగవంతం చేయనున్నారు. వినియోగదారులకు తాజా కూరగరాయలు,పండ్లు,పూలు, తకువ ధరలో అంధుబాటులోకి వస్తాయి,విభిన్న జిల్లాలో నుండి పంట ఒకటే దగ్గర చేరుతాయి,ఈ వ్యవసాయ మార్కెట్ను ఆధునిక వసతులతో నిర్మించనున్నారు కాబట్టి వ్యర్థం తగ్గుతుంది.
