Friday, June 26, 2026
Homeభక్తిDhwajasthambham | ధ్వజస్తంభం ప్రత్యేకత..!

Dhwajasthambham | ధ్వజస్తంభం ప్రత్యేకత..!

  • ఎందుకు ప్రతిష్ఠిస్తారో తెలుసా..
  • ధ్వజం అంటే జెండా ఉంచే స్థలం..

మనం ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు మొట్టమొదట దర్శనం ఇచ్చేది ‘ధ్వజస్తంభం’. ఆలయంలోని ప్రధాన దైవానికి ఎదురుగా ఇది ప్రతిష్ఠించి ఉంటుంది. దైవదర్శనం కోసం ఏ టెంపుల్​కు వెళ్లినా ముందుగా ఈ స్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామివారిని దర్శించుకుంటుంటాం. ఇంతకీ, అసలు ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? మన శాస్త్రాల్లో దీనికి ఎటువంటి వివరణ ఉంది? వంటి విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య తాడేపల్లి పతంజలి ఈ విధంగా వివరిస్తున్నారు.

“ధ్వజస్తంభం” ఈ పేరులోనే దాని అర్థం ఉంది. ధ్వజం అంటే ‘జెండా’. అంటే జెండా ఉంచేటటువంటి స్తంభం అని అర్థం. గుడి ప్రత్యేకతను చెప్పేటటువంటి ఒక జెండా ఉంటుంది. ఆ జెండాను ఉంచే స్తంభాన్నే ధ్వజస్తంభం చెబుతారంటున్నారు ఆచార్య తాడేపల్లి పతంజలి. మనం ఏదైనా గుడిలోకి అడుగుపెట్టబోయే ముందే ఎదురుగా మనకు చాలా ఎత్తులో ఈ ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అది ఎందుకు ప్రతిష్ఠిస్తారంటే, గుడి మన మానవ శరీరం. మనిషి శరీరంలో తల అనేటువంటిది స్వామివారి ఉండేటటువంటి గర్భాలయంకు సంబంధించినదైతే, ధ్వజస్తంభం అనేది వెన్నెముక లాంటిది.

- Advertisement -

మన శరీరానికి వెన్నెముక ఏ రకంగానైతే శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుందో, అంటే వంగిపోకుండా మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి శరీరానికి ఒక ఆధారంగా వెన్నెముక ఏరకంగా ఉంటుందో ఆ రకంగానే గుడిలో కూడా ఆలయానికి వెళ్లినటువంటి భక్తులందరికీ జీవితంలో అలా స్థిరత్వాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ధ్వజ స్తంభానికి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయంటున్నారు ఆచార్య తాడేపల్లి పతంజలి.

ఇప్పుడంటే గుడికి వెళ్లిన తర్వాత నమస్కారం చేస్తున్నారు. కానీ, ధ్వజస్తంభం దగ్గర కూడా నమస్కారం చేయాలి. మొట్టమొదట పూర్వపు రోజుల్లో ఆలయానికి వెళ్లేటటువంటి వాళ్లు ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారాలు కూడా చేసేవారు. ఎందుకనంటే ధ్వజస్తంభంలో ఆ గుడి గర్భాలయంలో ఏదైతే స్వామివారి తేజస్సు ఉన్నదో, ఆ తేజస్సు శాతం ధ్వజస్తంభం మీద ప్రసరిస్తూ ఉంటుందట. అందుకే, ధ్వజస్తంభం దగ్గర పూర్వకాలంలో నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేసేవారని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News