Friday, June 26, 2026
HomeజాతీయంJaipur | పోలీసుల అత్యుత్సాహం..

Jaipur | పోలీసుల అత్యుత్సాహం..

  • యువతికి తీవ్ర గాయాలు..
  • జైపూర్ లోని జగత్ పుర ఏరియాలో ఘటన..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్‌లోని జగత్‌పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 19న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కాన్వాయ్ కోసం జగత్‌పుర ప్రాంతంలో పోలీసులు సాయంత్రం ఏడు గంటల సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారుల్ని వెంటనే తమ షాపుల్ని తొలగించాలని కోరారు.

ఈ సమయంలో ఖుష్బూ గుప్తా, ఆమె చెల్లెలు రేషు గుప్తా కలిపి రోడ్డు పక్కన ఒక తోపుడు బండిపై మోమోస్ హోటల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు వచ్చి వెంటనే అక్కడ్నుంచి ఆ బండి తొలగించాలని సూచించారు. దీనికి స్పందించిన అక్కా చెల్లెళ్లు కొంచెం సమయం ఇవ్వాలని, షాపు తొలగిస్తామని కోరారు. కానీ, అది వినిపించుకోని పోలీసులు బండిని తోసేశారు. దీంతో ఈ బండి తలకిందులుగా పడింది. ఇదే సమయంలో బండిపై మోమోస్ చేసేందు కోసం వేడి నీళ్లు మరిగి ఉన్నాయి.

- Advertisement -

పోలీసులు బండిని పడేయడంతో ఆ వేడి నీళ్లు రేషు గుప్తాపై పడ్డాయి. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చేతులతోపాటు అనేక చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్లే తన చెల్లి తీవ్రంగా గాయపడిందని ఖుష్బూ ఆరోపిస్తోంది. తాము ఆ బండి తొలగించే పనిలోనే ఉన్నప్పటికీ, పోలీసులు కొంచెం సమయం కూడా ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News