Wednesday, May 13, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | లీకేజీల మధ్య నలిగిపోతున్న విద్యార్థుల కలలు

Aaj Ki Baath | లీకేజీల మధ్య నలిగిపోతున్న విద్యార్థుల కలలు

సంవత్సరాల తరబడి కంటి మీద కునుకు లేకుండా, పుస్తకాలనే ప్రపంచంగా చేసుకున్న లక్షలాది మంది విద్యార్థుల శ్రమను.. అంగడి సరుకులా మార్చేసిన పేపర్ లీకేజీలు, వ్యవస్థలోని లొసుగులకు పరాకాష్ట. ఇది కేవలం ఒక పరీక్షా పత్రం బయటకు రావడం కాదు.. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన వైద్య విద్యపై నమ్మకాన్ని తుంచివేయడం. ఎన్.డి.ఎ ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాల్సి ఉండగా.. అటు విపక్షాల విమర్శలు రాజకీయ రణక్షేత్రంగా మారుతుంటే… ఇటు మధ్యలో నలిగిపోతున్నది మాత్రం రెక్కలు తెగిన తమ పిల్లల కలలను చూసి విలపిస్తున్న తల్లిదండ్రులు.. నిస్సహాయ స్థితిలో ఉన్న విద్యార్థులు మాత్రమే!

- Advertisement -
RELATED ARTICLES

Latest News