కరీంనగర్ పట్టణం చిందు కులానికి చెందిన గజ్జెల మురళికి దళితరత్న అవార్డు దక్కింది. ఈమేరకు నిన్న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్, 57 ఎం బి ఎస్ సి కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం చేతులమీదుగా ఈ అవార్డు అందజేశారు.
ఈసందర్బంగా గజ్జెల మురళి మాట్లాడుతూ గతకొన్ని సంవత్సరాలుగా చిందుకులానికి, ఎస్సీ ఉపకులాల హక్కులకోసం కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం నాపై మరింత భాద్యత పెరిగిందని నాకు అవార్డు అందించిన బైరి వెంకటేశం కు ఇందుకు సహకరించిన తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయిల లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం సమ్మయ్య కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు
- Advertisement -
