- భారత్ కు విమాన మార్గంలో తరలింపు..
- పట్టుకున్న అమెరికా పోలీసులు..
భారత్‌కు విమాన మార్గంలో తరలిస్తున్న సుమారు 22 కేజీల కొకై*న్ ను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. ఆ కొకై*న్ విలువ సుమారు 1.5 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న ఎయిర్ కార్గో వేర్‌హౌజ్‌లో ఆ కొకై*న్‌ను సీజ్ చేశారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ పార్సిల్‌లో ఉన్న స్పీకర్లు, ఆంప్లిఫయర్స్ కింద ఆ కొకై*న్ దాచారు.
మ్యూజిక్ ఎక్విప్మెంట్ అన్న మార్కింగ్‌తో పార్సిల్ చేశారు. ఆపరేషన్ స్ట్రయికర్ పేరుతో సీబీపీ ఆపరేషన్ చేపట్టారు. స్పీకర్లు, ఆంప్లిఫయర్లలో 8 ప్యాకెట్లు, నాలుగు బ్రిక్స్ రూపంలో వైట్ పౌడర్‌ను దాచిపెట్టినట్లు సీబీపీ అధికారులు తెలిపారు. ఆ పౌడర్‌ను కొకై*న్ హైడ్రోక్లోరైడ్‌గా గుర్తిస్తూ అధికారులు నిర్దారణ చేశారు. 22 కేజీలు ఉన్న ఆ కొకై*న్ విలువ సుమారు 1.5 మిలియన్ల డాలర్లుగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
