Tuesday, June 16, 2026
HomeజాతీయంBorder Fence | అవసరమైన భూమి బదిలీ చేస్తాం..

Border Fence | అవసరమైన భూమి బదిలీ చేస్తాం..

  • బీ.ఎస్.ఎఫ్. కోసం కంచె వేయడానికి సహకరిస్తాం..
  • ప్రకటించిన పశ్చిమ బెంగాల్ సీఎం సుడెందు..

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళంకు బదిలీ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. అక్రమ చొరబాట్ల సమస్యను పరిష్కరించేందుకు 45 రోజులలోపు ఆ భూమిని కేంద్ర హోంశాఖకు అప్పగిస్తామని చెప్పారు. హౌరాలోని నబన్నాలో సమావేశమైన బెంగాల్‌ నూతన క్యాబినెట్‌ అందుకు అమోదం తెలిపినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం సీఎం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో బీఎస్ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలనేది ఒకటని చెప్పారు.

‘ఇవాళ మా తొలి మంత్రివర్గ సమావేశంలోనే బీఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ భూమి బదిలీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమవుతుంది. వచ్చే 45 రోజుల్లో దీన్ని కేంద్రహోంశాఖకు బదిలీ చేస్తాం. బదిలీ పూర్తయిన తర్వాత బీఎస్‌ఎఫ్‌ సరిహద్దు కంచె నిర్మాణం చేస్తుంది. తద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్ల సమస్య పరిష్కారమవుతుంది’ అని సువేందు అధికారి ప్రకటించారు. సీనియర్‌ అధికారులతో జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పాలనా ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News