Tuesday, May 5, 2026
HomeజాతీయంAmit Shah | బెంగాల్ పరిశీలకుడిగా అమిత్ షా..

Amit Shah | బెంగాల్ పరిశీలకుడిగా అమిత్ షా..

  • బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు..
  • ఈనెల 9 న ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం..

పశ్చిమ బెంగాల్, అసోంలలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. బెంగాల్ సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది. అమిత్ షా, మోహన్ చరణ్ ఆధ్వర్యంలో బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు సమావేశమవుతారు.

బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ నేతను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటును షా, మోహన్ పర్యవేక్షిస్తారు. బెంగాల్‌లో ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుంది. మరోవైపు అసోంకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకోసం కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాను బీజేపీ నియమించింది. నద్దాతోపాటు సహపరిశీలకుడిగా హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైని వ్యవహరిస్తారు.

- Advertisement -

వీరు ఇద్దరూ అసోంలో బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌‌ ఎన్నికను పర్యవేక్షిస్తారు. అసోంలో బీజేపీ కూటమి 82 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టబోతుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఆసక్తి నెలకొంది. బీజేపీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసోంలో ఇప్పటికే బీజేపీ నుంచి సీఎంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ అదే పదవిలో కొనసాగుతారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News