Saturday, April 25, 2026
Homeఆదిలాబాద్BJP Support | ఆర్టీసి కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు

BJP Support | ఆర్టీసి కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు

  • కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్

ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని, వారి సమ్మెను విరమింప చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు కొమరం భీమ్ జిల్లా//ఆసిఫాబాద్ డిపోలో చేస్తున్న సమ్మెకు మద్దతుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, ఎఫ్సిఐ బోర్డు సభ్యులు పులగం తిరుపతి, కేశవరెడ్డి, గోవర్ధన్, విశాల్ ఖండ్రే తో కలిసి మద్దతు తెలిపారు. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆసిఫాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో ఎదుట నిరసన తెలిపారు.

పోలీసులు, కార్మికులకు వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆసిఫాబాద్ మాజీ జడ్పీటీసీ కొయ్యల ఏమాజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉంటే ఆయన బ్రతికే వారని అన్నారు.

- Advertisement -

గతములో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందన్నారు. కార్మిక సంఘాల ను రద్దు చేసి వారి హక్కులను కాలరాసిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే టిఆర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. కార్మికులు ధైర్యంగా పోరాటం చేయాలని, అఘాయిత్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన సమ్మెకు బిజెపి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారూ.

- Advertisement -
RELATED ARTICLES

Latest News