ఆసుపత్రి బెడ్, కోర్టు డేట్..
పోలీస్ స్టేషన్ గేట్‌ల వద్ద..
నీ వెనుక నిలిచినోళ్లే కాదు..
నీ కన్నీటిని తుడిచిన వాళ్లే కదా..
నికార్సయిన నీవాళ్లు !
ప్రేమించడానికి మనిషి..
వాడుకోవడానికి పైసలు..
కావాలంటే వినరే ఈ నరులు
వద్దన్నా పైసలను ప్రేమిస్తారు..
మనుషుల్ని వాడుకుంటారు !
- Advertisement -
మంచితనం ముందు..
తలవంచాల్సిన నరులు
డబ్బుకు తలూపుతున్నారు
షరతుల బంధాల చట్రంలో..
మానవీయతను పాతరేస్తున్నారు !
- Advertisement -
