Tuesday, April 21, 2026
Homeరంగారెడ్డిHeatwave | హీట్ వేవ్ పై కలెక్టర్ హాట్ కామెంట్స్..!

Heatwave | హీట్ వేవ్ పై కలెక్టర్ హాట్ కామెంట్స్..!

ప్రస్తుతం వేసవి కాలం అయినందున జిల్లాలో ఎండ తీవ్రత ఉన్నందువలన తగు జాగ్రతలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారము జిల్లా అధికారులతో వేసవి తీవ్రత (హీట్‌వేవ్) నేపథ్యంలో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత (హీట్‌వేవ్) దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసర పరిస్థితులు లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

బయటకు వెళ్లే సందర్భంలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలు తరచుగా నీరు, మజ్జిగ, పండ్లరసాలు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. హీట్‌వేవ్ ప్రభావం వల్ల అలసట, తలనొప్పి, వాంతులు, చెమటలు ఎక్కువగా పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యశాలకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -

కూలీలు, కార్మికులు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లోనే పనులు నిర్వహించుకోవాలని, సంబంధిత అధికారి తగిన చర్యలు తీసుకోవాలని , బస్స్టాండ్ , రైల్వే స్టేషన్ ల దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనీ, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో షెడ్డు, తాగునీరు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారికి సూచించారు.

జిల్లాలోనీ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ హాస్పటలలో డాక్టర్లు సిబ్బంది మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు వేసవి కాలమైనందున అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశములో అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, వీఆర్వో సంగీత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News