Homeరంగారెడ్డిJayanti | అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

Jayanti | అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

  • సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్.

అబ్దుల్లాపూర్ మెట్‌లో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ముఖ్య అధితిగా పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్యా అవకాశాలు కల్పించాలనే ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
Ambedkar Jayanti Celebrations in Abdullapurmet2

అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, సేవాభావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్, పాలకవర్గ సభ్యులు మాచగోని మహేందర్ ముధిరాజ్, మొగుళ్ల జీవన్ కుమార్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, టి.శివ, అంబేద్కర్ సంఘం నాయకులు, గుండె రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News