జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ అడ్డా స్థలం కేటాయింపు కోసం సంఘం కమిటీ సభ్యులు కిసర సర్కిల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్మికులకు స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టేందుకు అధికారులతో మాట్లాడి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ సానుకూలంగా స్పందించి వెంటనే ఉన్నత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.
త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను తెలియజేసి భవన నిర్మాణానికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, అధ్యక్షుడు చెన్నాపురం యాదయ్య, గౌరవ అధ్యక్షుడు కొయ్యడ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, సలహాదారు రమణ రెడ్డి, మల్లేష్, కోశాధికారి కోట్ల చెన్నా రెడ్డి, మరాఠి బాబు, ఐలయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
