ఆదివాసుల హక్కుల సాధనకై ఉద్యమించిన రాంజీ గోండ్ ఆశయ సాధనకై ఉద్యమించాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రాంజీ గోండ్ 166వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిజాం నిరంకుశతత్వాన్ని ఎదిరించిన గొప్ప నాయకుడు రాంజీ గోండ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, యువకులు తదితరులున్నారు.
- Advertisement -
