- బీజేపీ నేతల సన్మాన కార్యక్రమంలో నాయకులు
హిందువులకుఅత్యంత పవిత్రమైన, ప్రామాణికమైన వేదాలను అవమానిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపినందుకు, ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన మేడ్చల్ రూరల్ జిల్లా బీజెవైఎం (BJYM) అధ్యక్షులు పవన్ రెడ్డి, బీజెవైఎం స్టేట్ స్టడీ సర్కిల్ కన్వినర్ రాము యాదవ్ లను. మేడ్చల్ కన్వినర్ రాము యాదవ్ లను మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఎల్లంపేట్ జగన్ గౌడ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో నేతలుమాట్లాడుతూ.హిందూ ధర్మంపై,వేదాలపై జరుగుతున్న దాడులను తాము చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వాల అణచివేతకు భయపడేది లేదని, భవిష్యత్తులోనూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, బీజేపీ నాయకులు చెరువుకొమ్మ శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, రాఘవ రెడ్డి, బండి విష్ణు గౌడ్, వంశీరెడ్డి,గోపు నాగరాజ్, రతన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
