నిర్మల్లోని పలు వాటర్ ప్లాంట్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో ప్లాంట్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం, కనీస ప్రమాణాలు పాటించకపోవడాన్ని ఆయన గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘించిన పలువురు యజమానులకు జరిమానాలు విధించారు. తాగునీటి విషయంలో రాజీ పడకూడదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



- Advertisement -
