Homeఆదిలాబాద్Collector | ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు

Collector | ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.

Bhavesh Mishra Reviews Praja Vani Applications1 1

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

- Advertisement -
Bhavesh Mishra Reviews Praja Vani Applications6

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News