Sunday, May 31, 2026
Homeఆదిలాబాద్Nirmal | బ్యాటరీ షాపులో అగ్నిప్రమాదం

Nirmal | బ్యాటరీ షాపులో అగ్నిప్రమాదం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో గల వాహనాల బ్యాటరీ దుకాణంలో ఉదయం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం వాహనాల బ్యాటరీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని చెలరేగుతున్న మంటలను ఆర్పి వేశామన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని అన్నారు. కేవలం షాప్ లో ఉన్న బ్యాటరీలు, సామాగ్రి అగ్నికి ఆహుతవ్వడంతో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News