Homeఆదిలాబాద్Health Camp | ప్రభుత్వ వసతి గృహాల్లో ఆరోగ్య శిబిరాలు….

Health Camp | ప్రభుత్వ వసతి గృహాల్లో ఆరోగ్య శిబిరాలు….

మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల, బాలుర వసతి గృహాల్లో సోమవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వెంకటాపురం వైద్యాధికారి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాల సీజన్లో విద్యార్థులు జలుబు, దగ్గు కలిగి ఉంటే కాచి చల్లార్చిన నీరు త్రాగాలని సూచించారు. తలనొప్పి, అలసట, జ్వరం ఉన్నవారికి ఆర్డిటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఆహారం తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అన్నారు.

Health Camps Government Hostels Venkatapuram Students

ఉతికిన బట్టలను ఆరిన తర్వాతనే ధరించాలని, తడి దుస్తులను ధరించరాదని తెలిపారు. ఐదవ పరీక్షలు నిర్వహించిన వారందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెదవ ఖాన్ వైద్యాధికారి పవన్ కళ్యాణ్ తో పాటు కేజీబీవీ, బాలికల, బాలుర హాస్టల్ వార్డెన్లతోపాటు హెచ్ ఈ ఓ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రాఘవులు, ఏఎన్ఎంలు పార్వతి, సుశీల, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News