- ఏపీ జితేందర్ రెడ్డి
- తెలంగాణ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి భేటీ*
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం నుంచి పెండింగ్ నిధులు, విభజన హామీలను రాబట్టేందుకు ఎంపీలందరూ సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ‘గురజాడ’ సమావేశ మందిరంలో అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
సమన్వయకర్తగా అద్వైత్ కుమార్ సింగ్:
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను కేంద్రంతో సమన్వయం చేసేందుకు నూతనంగా నియమితులైన సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ఈ సందర్భంగా ఎంపీలకు పరిచయం చేశారు.

కీలక అంశాలపై చర్చ:
విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుపై, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపై ఎంపీల అభిప్రాయాలు, సలహాలు స్వీకరించారు. అలాగే పెండింగ్ సమస్యల పరిష్కారానికి సమిష్టి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఎంపీలు డా.మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్యతో పాటు రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
