Monday, March 16, 2026
HomeజాతీయంMP Kesineni Chinni | లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని రైతు పక్షపాత గళం

MP Kesineni Chinni | లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని రైతు పక్షపాత గళం

  • కిసాన్ క్రెడిట్ రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

రైతు సంక్షేమమే ధ్యేయంగా కిసాన్ క్రెడిట్ కార్డు (కెసీసీ) ద్వారా అందజేసే స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ మేరకు మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కలిపి మొత్తం 66.37 లక్షల కెసీసీ ఖాతాలు ఉన్నాయని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వీటి ద్వారా రూ. 84,522 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6.73 లక్షల ఖాతాల ద్వారా రూ. 10,134 కోట్ల రుణాలు అందగా, ఎన్టీఆర్ జిల్లాలో 1.94 లక్షల ఖాతాలకు రూ. 1,677 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ కోరిన వివరాల మేరకు, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు (ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్) రూ. 595.38 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News