Homeహైదరాబాద్‌Sitaphalmandi | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Sitaphalmandi | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

  • అన్ని రంగాల్లో మహిళల ప్రతిభతో వెలుగొందాలి–గాయని మధుప్రియ,రేలారే గంగ
  • మహిళల సాధికారతకు ప్రభుత్వం–సమాజం కలిసి పని చేయాలి: డా.సామల హేమ

సికింద్రాబాద్ సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ఆధ్వర్యంలో సోమవారం నాడు సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలంగాణ జానపద స్టార్ గాయకురాలు,మధుప్రియ, రేలారే గంగా ముఖ్య అతిథులుగా హాజరై తమ మధురమైన పాటలతో అలరించి శక్తివంతమైన మహిళలుగా మరింతగా ఎదగాలని సందేశాలతో మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.మహిళల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు,సత్కారాలు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను, అదేవిధంగా భవిష్యత్తు రంగమంతా ప్రధమ భాగం ప్రపంచాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకు వెళుతున్నది మహిళలేనని ప్రస్తావించారు.నేటి కాలంలో మహిళలు విద్య,ఉద్యోగం,వ్యాపారం,కళలు తదితర అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే కుటుంబం నుంచి దేశం వరకు అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
International Womens Day Celebrations at Sitaphalmandi Hall

సీతాఫల్మండి తాజా మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థలు,సమాజం కలిసి పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి రంగాల్లో మరింత ప్రోత్సాహం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మంగతాయారు,జీహెచ్‌ఎంసీ ఏ.సీ.అశలత,ఈ.ఈ.సువర్ణ, సీ.ఓ.ధనుశ్రీ,మాజీ కార్పొరేటర్ కంది శైలజ,ధనుంజయ్ గౌడ్,గీత సింగ్,సికింద్రాబాద్ నియోజకవర్గ మహిళా నాయకురాళ్లు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News