Monday, February 23, 2026
Homeరంగారెడ్డిYellampet | ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా శ్రీదేవి రమేష్..

Yellampet | ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా శ్రీదేవి రమేష్..

  • నేడు బాధ్యతల స్వీకరణ..

ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా శ్రీదేవి రమేష్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వామి నాయక్, చైర్పర్సన్ శ్రీదేవి రమేష్కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

అనంతరం మున్సిపల్ సిబ్బంది,చమకూర మహేందర్ రెడ్డితో కలిసి కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్పర్సన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రజల సహకారంతో ఎల్లంపేట్ మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, బాస్కర్ యాదవ్,దయానంద్ యాదవ్,సుశాంత్ రెడ్డి,రాజేందర్, సద్ది సురేష్ రెడ్డి, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News