Monday, February 23, 2026
Homeహైదరాబాద్‌Excavations | జానంపేటలో పురావస్తు తవ్వకాలు

Excavations | జానంపేటలో పురావస్తు తవ్వకాలు

  • పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్కియాలజీ విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జానంపేటలో పురావస్తు తవ్వకాలు కొనసాగుతున్నాయి.ఈ తవ్వకాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ,కల్చర్ అండ్ ఆర్కియాలజీ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ సి.కాశీం ప్రోత్సాహంతో సైట్‌ను సందర్శించినట్లు తెలిపారు.అర్చలోజికల్ సర్వే అఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరిండెంటింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ దాస్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి.

జానంపేటలోని మెగాలితిక్ బరియల్స్ ద్వారా ఆదిమానవుల జీవన విధానం, సంస్కృతి పై కీలక ఆధారాలు లభిస్తున్నాయని డాక్టర్ శివానంద్ యాలాల తెలిపారు.పురావస్తు తవ్వకాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం లభిస్తుందని,భవిష్యత్తులో పురాతత్వవేత్తలుగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని రీసెర్చ్ స్కాలర్ మేడి దివ్య పేర్కొన్నారు.ఆమె ప్రొఫెసర్ ఎన్ఆర్ గిరిధర్ పర్యవేక్షణలో పరిశోధన కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News