Monday, February 23, 2026
Homeరంగారెడ్డిSupport | సహచరుని కుటుంబానికి ఆర్థిక ఆసరా

Support | సహచరుని కుటుంబానికి ఆర్థిక ఆసరా

గ్రూపు సభ్యుల నుంచి విరాళాలు సేకరించి… సురక్ష సేవా సంఘం ద్వారా… మృతుడు CI జాన్సన్ బాబు కుటుంబానికి 8 లక్షల రూపాయలు అందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 2002 బ్యాచ్ కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుత AHTU ఇన్స్పెక్టర్ జాన్సన్ బాబూరావు, గత సంవత్సరం 10 వ నెలలో అనారోగ్యంగా కారణంగా మరణించడం జరిగింది. హఠాత్తుగా సహచర మిత్రుడు మరణించడం తో జీర్ణించుకోలేని సహచర ఇన్స్పెక్టర్లు జాన్సన్ బాబు కుటుంబానికి అండగా నిలిచారు. గ్రూపు సభ్యులనుండి విరాళాలు సేకరించి, సురక్ష సేవా సంఘం ద్వారా తక్షణ సహాయం కింద 8లక్షల రూపాయలు మృతుని కుటుంబానికి ఆదివారము అందించి, భవిష్యత్ లో ఎటువంటి అవసరాలు కైనా మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. సహచర మిత్రుడి కుటుంబం పట్ల చూపిన ఔదార్యానికి 2002 బ్యాచ్ పోలీస్ అధికారులకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక ముద్దనూర్ ఇన్స్పెక్టర్ నగేష్ బాబు, కడప ఇన్స్పెక్టర్ ఉజ్జిని సదాశివయ్య, చిన్న చౌక్ ఇన్స్పెక్టర్ గౌనీ, ఓబులేష్, వేంపల్లి ఇన్స్పెక్టర్ T. నర్సింహులు, కొండాపూర్ ఇన్స్పెక్టర్ P. రాజా, మున్నూరు ఇన్స్పెక్టర్ S లింగప్ప, DTRB కడప ఇన్స్పెక్టర్ S మహమ్మద్ బాబా, కడప రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు శ్యామల వెంకటేష్, అవ్వారి నరసింహ స్వామి, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ పార రాజు, సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News