Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిTragedy | చేపల వేటకెళ్లి యువకుడు గల్లంతు.

Tragedy | చేపల వేటకెళ్లి యువకుడు గల్లంతు.

  • రంగంలోకి దిగిన పోలీసుకు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు.
  • శోకసంద్రంలో మూడు తండాల ప్రజలు.

చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందిగామ మండలం చాకలిదానిగుట్ట తాండకు చెందిన ముడావత్ భాస్కర్ (25), మంగళవారం మధ్యాహ్నం తన భార్య అనితకు చేపలు పట్టడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని, చీకటి పడినప్పటికి ఇంటికి రాకపోయే సరికి, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు.చివరగా రంగాపూర్ గ్రామంలోని మల్లన్న చెరువుగట్టుపై మృతుని భాస్కర్ బట్టలు, చెప్పులు, వాహనం, ఫోన్ కనిపించాయి.

వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని విషయాన్ని తెలుసుకున్నారు.చీకటి పడటంతో బుధవారం  ఉదయం నుండి పోలీసులు, ఫైర్ సిబ్బంది (రెస్క్యూ టీం),గజ ఈతగాడు రాజు సహయంతో చెరువులో గల్లంతైన భాస్కర్ ని బయటకు తీశారు.పోస్టు మార్టం నిమ్మితం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

భార్య అనిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెరువు వద్దకు భారీగా మోహరించారు యువకుడు మృతితో తండాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాలుగేళ్ళ క్రితం పెళ్లి జరిగిందని, భార్య,ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ప్రజలంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News