బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల(Bangladesh General Elections)కు సిద్ధమవుతోంది. ఆ దేశంలో ఫిబ్రవరి 12న పోలింగ్(Polling) జరగనుంది. 127 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీల్లో ఒకటైన అవామీ లీగ్(Awami League)ను ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. దీంతో.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP).. రేసులో ముందుంది. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ఈ ఎన్నికలను “గొప్ప పండుగ”గా అభివర్ణించారు. ఇవి దేశ చరిత్రలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుత ఓటు అవుతుందని చెప్పారు. కొత్త బంగ్లాదేశ్‌కు ఇవి పునాది వేస్తాయని తెలిపారు. కానీ.. మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ప్రధాన రాజకీయ పార్టీ(Awami League) బరిలో లేకపోవడం, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఎన్నికల పోటీ స్వభావాన్ని బలహీనపరిచాయని, స్థిరత్వం, చట్టబద్ధతపై ఆందోళనలను పెంచాయని పరిశీలకులు అంటున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని అత్యంత ముఖ్యమైన ఎన్నికగా, 2024 ఆగస్టులో షేక్ హసీనా పాలనను అంతం చేసిన ప్రజా తిరుగుబాటు తర్వాత జరగబోయే తొలి ఎన్నికగా వీటికి ప్రాముఖ్యత ఉంది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాత్ ఇ ఇస్లామీ పార్టీలు 2025 ఆగస్టు వరకు చాలా కాలం కూటమిగా ఉండేవి. కానీ ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అవామీ లీగ్ పార్టీ ఓట్లు తమకు పడతాయనే అంచనాతో ఈ రెండు పార్టీలు వేరుపడ్డట్లు చెబుతున్నారు.
Bangladesh | ఎన్నికలకు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
