Saturday, February 21, 2026
HomeతెలంగాణSIT Notice | కేసీఆర్కు మరోమారు నోటీసులు

SIT Notice | కేసీఆర్కు మరోమారు నోటీసులు

  • ఫామ్ హౌజ్ విచారణ కుదరదని స్పష్టీకరణ..
  • నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి..
  • ఆదివారం 3గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీస్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్హస్లో కాకుండా హైదరాబాద్లోనే కేసీఆర్ను విచారించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కాగా, గురువారం సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటు లో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు.

ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని కేసీఆర్ కు సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని జనవరి 29న 160 సీఆర్ పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండగా.. బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు. జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు.

- Advertisement -

ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని అధికారులకు సూచించారు. అలాగే భవిష్యత్ లోనే ఎలాంటి నోటీసులైనా.. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపాలని విన్నవించారు. అయితే కేసీఆర్ వినతిపై న్యాయనిపుణులతో చర్చించిన సిట్ ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3గంటలకు బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో విచారిస్తామని నోటీసు జారీ చేసింది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు.

మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ను ఎక్కడ విచారించాలనే దానిపై సిట్ అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్హస్లో కాకుండా హైదరాబాద్లోనే విచారించాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News