మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందనలు
థాయ్‌లాండ్(Thailand)లో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు(beach wrestling competitions) మన దేశం తరఫున గురుకుల విద్యార్థి ఎంపికయ్యాడు. అతని పేరు ఆర్.శివమల్లిఖార్జున. పల్నాడు జిల్లా యడ్లపాడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి. విశాఖలో జరిగిన రాష్ట్ర స్ధాయి బీచ్ కుస్తీ పోటీల్లో ప్రథమ స్ధానంలో నిలిచాడు. తద్వారా గోల్డ్ మెడల్ సాధించాడు. జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ పొందాడు. ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లో జరగనున్న రెజ్లింగ్ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి(Minister Dola Balaveeranjaneyaswamy).. శివమల్లిఖార్జునను వెలగపూడి సచివాలయంలో అభినందించారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడంతోపాటు క్రీడలను ప్రోత్సాహిస్తోందన్నారు. పేద విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారన్నాని చెప్పారు.
